13 April, 2026 | 4:27 PM

Breaking News

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •  

స్టార్టప్‌ల కేంద్రంగా టీ-హబ్‌: సీఎం రేవంత్ ఆదేశం

24-01-2026 12:36 PM

హైదరాబాద్: టీ హబ్‌ వ్యవహారంలో రేవంత్ సర్కార్‌ యూటర్న్‌ తీసుకుంది. టీ-హబ్‌ను(T–Hub స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడారు. 

అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ-హబ్‌ను ప్రత్యేకంగా స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌లో ఇతర కార్యాలయాలు ఉండకూడదని, అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.