09-12-2025 01:34:15 PM
రాష్ట్రంలో పెట్టుబడుకు దేశ, విదేశీ కంపెనీల ఆసక్తి
వివిధ కంపెనీలతో సీఎం వరస సమావేశాలు
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో పెట్టుబడులకు పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. సుమధుర గ్రూప్, టీసీసీఐ తైవాన్ గ్రూప్ ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ప్రెస్టీజ్ గ్రూప్ సీఈవో స్వరూప్ అనివేశ్, అనలాగ్ ఏఐ ఓటూడ్లోజ్, డ్రీమ్ వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్, సెంబ్ కార్ప్(సింగపూర్) ప్రతినిధులు, తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెట్టుబడులకు ఆసక్తి చూపించారు.