30-10-2025 09:07:05 AM
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పొంగిపోర్లుతున్న వాగులు
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా( Mahabubabad district) వ్యాప్తంగా వాగులు పొంగిపోర్లుతున్నాయి. జిల్లాలో వర్షం తగ్గినా.. వాగుల ఉద్ధృతి కొనసాగుతోంది. కేసముద్రం మండలం అర్పణపల్లి వద్ద వట్టి వాగు పొంగిప్రవహిస్తోంది. వట్టివాగు ఉద్ధృతికి కేసముద్రం నుంచి గూడూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల వాగు గూడూరులో ఉద్ధృతంగా ప్రవాహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల్లికుదురు మండలంలో రహదారులపై నుంచి వరద ప్రవహిస్తోంది. కల్వర్టులపై వరద ప్రవహిస్తుండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల సమీపంలో పాకాల వాగు పొంగిపోర్లుతుంది. గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కౌసల్యాదేవిపల్లి వద్ద ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం వద్ద పాలేరు వాగు ఉద్ధృతి వల్ల రాకపోకలు నిలిపోయాయి.