మట్టిలో మాణిక్యాలు.. పదో తరగతి టాపర్లు
హైదరాబాద్: రవీంద్రభారతిలో పదో తరగతి టాపర్లకు ప్రతిభా పురస్కారాలు అందించారు. వందేమాతరం ఫాండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మాన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎం చేతుల మీదుగా విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతో సీఎం రేవంత్ ముచ్చటించారు. వందేమాతరం ఫౌండేషన్ ను ఆయన అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించటం అభినందనీయం అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల టాపర్లను నిజానికి ప్రభుత్వమే సన్మానించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మట్టిలో మాణిక్యాలుగా రాణించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని సీఎం కొనియాడారు. ఇప్పడు సర్వీసులో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ లలో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని ఆయన పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్రమంత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని చెప్పారు. కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి.






