calender_icon.png 3 December, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆహ్వానం

03-12-2025 12:55:33 PM

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బుధవారం పార్లమెంటులో కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను(Union Minister Ashwini Vaishnaw) కలిసి డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి సదస్సులో ఆవిష్కరించేందుకు ప్రతిపాదించిన విజన్ డాక్యుమెంట్‌ను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీరారెడ్డి, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, ఎం అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.