calender_icon.png 3 December, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్‌ పీఎస్‌లో ఎస్ఐ మృతి

03-12-2025 12:39:21 PM

హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్(LB Nagar Police Station) లో గుండెపోటులో ఎస్ఐ మృతి చెందాడు. బ్యారక్ లో నిద్రిస్తూ ఎస్ఐ సంజయ్ సావంత్ (58) చనిపోయారు. పడకపై అచేతనంగా పడివున్న ఎస్ఐను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిద్రలోనే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.