16 March, 2026 | 3:09 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

రైతు రుణమాఫీ పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

18-07-2024 05:31 PM

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి మొదటి విడుత రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. సీఎం చేతుల మీదుగా కొంతమంది రైతులకు రైతు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. తొలి విడుతలో రూ. లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేశారు. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమ చేశారు.

ఈ నెలాఖరునాటికి రూ. లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ, ఆగస్టు 15లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసిన ఆర్థిక శాఖ మూడు దశల్లో రుణాలు మాఫీకి ప్రభుత్వం నిర్ణయం ఇచ్చింది. రెండో విడుత రుణమాఫీకి రూ.8 వేల కోట్లు అవసరమని అంచనా, రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయగా, మూడో విడుత రుణమాఫీకి రూ.15 వేల కోట్లు అవసరమని అంచన వేయగా..  రైతుల ఖాతాల్లో ఆగస్టు 15లోపు నగదు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.   రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రుణమాఫీకి ప్రామాణికం పాస్ పుస్తకమే.. రేషన్ కార్డు కాదన్నారు. గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసిందని, వాటికి ప్రతి నెలా రూ.7 వేల కోట్లు వడ్డి చెల్లిస్తున్నామని సీఎ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.