22 June, 2026 | 1:26 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

కోదాడ రూరల్ సీఐ సస్పెండ్

20-12-2025 10:43 AM

కర్ల రాజేష్ లాకప్ డెత్‌ కేసే కారణమా?

కోదాడ: కోదాడకు చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటన నేపథ్యంలో పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోదాడ రూరల్ సీఐ(Kodada Rural CI suspended) ప్రతాప్ లింగం ని సస్పెండ్ చేస్తూ, చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ   ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లాకప్‌లో రాజేష్ మృతి చెందిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటన రీత్యా అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రూరల్ సీఐపై కూడా చర్యలు తీసుకోవడం గమనార్హం.