8 July, 2026 | 8:23 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం: సీఎం

19-09-2024 04:38 PM

హైదరాబాద్: సచివాలయంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్  శ్రీను రాజు, సీఎస్ శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... స్కిల్ వర్సిటీ నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. వర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ వర్సిటీ నిర్వహణకు అందరూ సహకారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. వర్సిటీకి సంబంధించిన కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించి, స్కిల్ వర్సిటీలో కోర్సుల వివరాలను తెలిపారు.