11-12-2025 11:52:17 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రయాంక గాంధీని కలిశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించినట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను సోనియా గాంధీకి వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎంతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ ఎంపీలు సోనియాతో భేటీ అయ్యారు.