calender_icon.png 22 December, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయంత్రం మంత్రులతో సీఎం కీలక భేటీ

22-12-2025 11:34:35 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో(Command and Control Office) మంత్రులతో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాలవారీగా సమీక్ష, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముందని వర్గాలు తెలిపాయి. త్వరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు‌, అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం మంత్రులతో చర్చించున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.