22-12-2025 11:54:12 AM
హైదరాబాద్: వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ ప్రమాణస్వీకారంలో ఘర్షణ నెలకొంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శ్వేత, కాంగ్రెస్ ఉప సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాటల విషయంలో వివాదం తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో ఒకరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో నేడు కొత్త సర్పంచులు(sarpanches), ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల(ward members) ప్రమాణస్వీకారం చేస్తున్నారు. సర్పంచుల ప్రమాణస్వీకారానికి పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈనెల 11,14,17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు(Telangana Gram Panchayat Elections) ముగిశాయి. 12,702 మంది కొత్త సర్పంచులు, 1,11,803 మంది వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో సర్పంచుల ప్రమాణస్వీకారం జరుగుతోందని అధికారులు తెలిపారు.