22-12-2025 11:15:10 AM
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Rajiv Gandhi International Airport) మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. నెదర్లాండ్స్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు. విమానం ఆర్‌జీఐఏలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (Central Industrial Security Force) సిబ్బంది సహాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత బాంబు నిర్వీర్య బృందంతో తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని వారాలుగా ఆర్‌జిఐఏకు వరుసగా బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వస్తుండటంతో సిబ్బంది, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.