calender_icon.png 22 December, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ వ్యాఖ్యలపై కౌంటర్

22-12-2025 12:42:43 PM

బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగిపోయి తోలు మిగిలింది.

కేసీఆర్ ఆ ఉద్దేశంతోనే బయటకొచ్చారు.

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత రాగానే తోలు తీస్తానని కేసీఆర్ చెబుతున్నారు.. బీఆర్ఎస్ పార్టీకి కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) చమత్కరించారు. గాంధీభవన్ లో మంత్రులు జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం అని కేటీఆర్ ఇటీవల చెప్పారని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఆరోపణలు తప్పు అని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయని ఆయన ఆరోపించారు. ఇరు పార్టీలు కలిసి పనిచేసినా మూడింటి ఒక వంతు సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. 

పార్టీ బలహీనమైంది.. ప్రతిష్ఠ కాపాడుకోవాలని కేసీఆర్ కు అర్థమైందన్నారు.పార్టీ ప్రతిష్ఠ కాపాడుకోవాలనే ఉద్దుశంతోనే కేసీఆర్ బయటకు వచ్చారని జూపల్లి జోస్యం చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు సమస్య గురించి కేసీఆర్ బయటకు రాలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టును కుర్చి వేసుకుని కట్టిస్తా అని కేసీఆర్ చెప్పారు.. పదేళ్లు పాలించి.. రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేసినా ఎకరా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన కాలువలు కూడా పూర్తి చేయలేదని సూచించారు. 2023 ఎన్నికల వేళ ఒక మోటరు ఆన్ చేసి పాలమూరు ప్రాజెక్టు జాతికి అంకితమన్నారని ఆయన తెలిపారు.

నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా ప్రాజెక్టు అంకితమన్నారని గుర్తుచేశారు. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ తిరస్కరించినట్లు ఆరోపిస్తున్నారు. గత కాంగ్రెస్ పాలనలోనే జూరాల నుంచి 70 టీఎంసీలకు మంజూరైందని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ. 40-50 వేల కోట్లు కావాలని జూపల్లి వెల్లడించారు. పర్యావరణ అనుమతులు తీసుకుంటే మన నీళ్లు మనం వాడుకునే పరిస్థితి ఉందన్నారు. సాకుకు కాదు తాగునీటి కోసమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. తాగునీటి కోసం పనులు మొదలు పెట్టవచ్చని 2025లో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇరు రాష్ట్రాలు కలుపుకుని 811 టీఎంసీలు అని విభజన చట్టంలో ఉందన్నారు. నదీ పరివాహక ప్రాంతం ఉన్నంత మేరకు నీటి కేటాయింపులు జరగాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు చాలు .. 512 టీఎంసీలు ఏపీ వాడుకోవాలని పదేళ్లు వదిలేశారని మంత్రి జూపల్లి మండిపడ్డారు.