22-12-2025 11:45:37 AM
వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకారానికి సర్పంచ్ సహా ఏడుగురు వార్డ్ మెంబర్లు గైర్హాజరు
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్పంచ్ తో పాటు ఏడుగురు వార్డు సభ్యులు హాజరు కాలేదు. ఉప సర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంతో అధికారులు వారితో ప్రమాణస్వీకారం మహోత్సవం చేపట్టారు.గ్రామపంచాయతీ పరిధిలో 14 వార్డులు ఉండగా ఉపసర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు హాజరు అవడంతో సగం కోరం ఉండడంవల్ల ప్రమాణస్వీకారం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం లో సభ్యుల మధ్య భేదం ఉండడం కనిపించింది.సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య ఆదిలోనే వర్గ విభేదం దర్శనమిచ్చింది.గ్రామపంచాయతీ పాలకవర్గ కాలం ఐదేళ్లపాటు కలసి పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు ఎవరికి వారు వర్గాలుగా విడిపోవడం చూస్తే మీరు హయాంలో పంచాయతీ అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ప్రభుత్వం సర్పంచ్ ,వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి విడుదల చేసిన షెడ్యూల్ నే సర్పంచ్ గౌరవించకపోవడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.