22 July, 2026 | 4:57 AM

డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

30-06-2024 12:07 PM

హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్​కు నిన్న ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించారు. డీఎస్ కుటుంబసభ్యులను సీఎం పరామర్శించారు. డీఎస్ పార్థివదేహాన్ని పలువురు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, బంధువులు నివాళులర్పించారు. మంత్రులు, కాంగ్రెస్‌ జాతీయ నాయకులు, బీజేపీ జాతీయ నాయకులు నివాళులర్పించారు. డీఎస్ అంతిమ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. నిజామాబాద్‌ నగర శివారులోని వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలను, ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.