ప్రధాని మోడీ 'మన్ కీ బాత్'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' 111వ ఎపిసోడ్ ఆదివారం జరిగింది. లోక్ సభ ఎన్నికల తర్వాత తొలి 'మన్ కీ బాత్' కార్యక్రమం ఇది. రాష్ట్రాల్లో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 25 తర్వాత ఎన్నికల దృష్ట్యా కార్యక్రమం వాయిదాపడింది. మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ మాట్లాడుతూ... ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు జరిగాయని ప్రధాని అన్నారు. ఎన్నికల తర్వాత మరోసారి కలుస్తామని మీ అందరికీ చెప్పా అన్న ప్రధాని మన్ కీబాత్ ద్వారా మరోసారి మీ ముందుకు వస్తున్నానని తెలిపారు.
మన్ కీ బాత్ కొన్ని నెలలు నిలిచినా ఆ స్ఫూర్తి మాత్రం దేశమంతా ఉందన్నారు. రుతుపవనాల రాకతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగంపై ప్రజలు తమ విశ్వాసాన్ని చాటుకున్నారని మోడీ తెలిపారు. గిరిజనులు ఇవాళ హల్ దివస్ వేడుకలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వీర్ సిద్ధు, కన్హు ధైర్యానికి ప్రతీకగా ఇవాళ్టి రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విదేశీ పాలకుల దురాఘాతాలపై వీర్ సిద్ధి, కన్హు పోరాడారని ప్రధాని గుర్తుచేశారు.






