అభినందన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: క్షత్రియ సేవా సమితి నిర్వహిస్తున్న అభినందన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. క్షత్రియ సేవా సమితి సీఎం రేవంత్ రెడ్డని అభినందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కష్టపడే గుణం వల్ల క్షత్రియులు ఎక్కడైనా విజయవంతం అవుతారన్నారు. విజయానికి, నమ్మకానికి మారుపేరు క్షత్రియులు అని, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రభాస్ విశ్వవ్యాప్తంగా చేశారని సీఎం పేర్కొన్నారు.
కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో బోసురాజుది కీలక పాత్ర అని కొనియాడారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో ఛైర్మన్ గా రాజును నియమించామన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో రాజుల శ్రమ కూడా ఉందని, ఫోర్త్ సిటీలో కూడా రాజులు పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. క్షత్రియ భవన్ కు కావల్సిన భూమి, అనుమతులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.






