16 June, 2026 | 3:20 PM

కోల్కతా హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

18-08-2024 06:59 PM

న్యూఢిల్లీ: కోల్ కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సమోటోగా తీసుకుంది. సుప్రీంకోర్టు త్రిసభ ధర్మసనం ఘటనపై ఎల్లుండి విచారణ చేపడతామని తెలిపింది. కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన జూనియర్ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటన కేసును సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు భాతర ప్రధాన న్యాయమూర్తికి లేక రాశారు.

ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వెబ్ సైట్ లో పొందుపరిచింది. కోల్ కతా హత్యాచార ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. హత్యాచారం ఘటన వెలుగులో వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా సేవలు నిలిపివేశారు.