11 July, 2026 | 9:34 PM

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలన

07-07-2024 03:04 PM

మహబూబ్​నగర్జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరుగు తున్న నిర్మాణపు పనులను ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  పరిశీలించారు.అక్కడ జరుగుతున్న పనుల గురించి అధికారులను, ఆసుపత్రి ఇఇలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జ.మధుసూధన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ  డి జానకి, జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ, పిడి డిఆర్డిఎ నర్సింహులు,  మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జనరల్ ఆసుపత్రి  సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, వైద్యశాల ఇఇ జైపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.