17 April, 2026 | 12:49 PM

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ – మండలం స్థాయి వరకు మాత్రమే

06-02-2026 09:41 PM

చివ్వెంల: ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ప్రస్తుతం మండలం స్థాయి వరకు మాత్రమే పరిమితం చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు తమకు భూములు ఉన్న మండలంలోనే యూరియా బుకింగ్ చేసుకోవాల్సిందిగా సూచించారు.

రైతులకు ముఖ్యమైన సూచనలు

*  రైతులు తప్పనిసరిగా భూములు ఉన్న మండలంలోనే యూరియా బుకింగ్ చేయాలి.

*  ప్రస్తుతం ఫోన్‌లో ఉన్న పాత ఫర్టిలైజర్ యాప్‌ను Uninstall చేయాలి.

*  Play Store నుండి కొత్త వెర్షన్ ఫర్టిలైజర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.

*  కొత్త యాప్ ద్వారా సులభంగా యూరియా బుకింగ్ పూర్తి చేయవచ్చు

ఈ మార్పుల నేపథ్యంలో రైతులు అందరూ విషయం గమనించి సహకరించాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఎలాంటి సందేహాలు ఉన్నా సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.