17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వైభవంగా శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి 17వ వార్షికోత్సవం

06-02-2026 09:24 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో వెలసిన శ్రీ హనుమాన్, భవాని రామలింగేశ్వర దేవాలయ, 17వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రతిష్ఠాపన జరిగి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుండే ఆలయంలో వేద మంత్రోచ్ఛారణలు మారుమోగగా, అర్చక స్వాములు గణపతి పూజ, అభిషేకం, హోమం అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం శ్రీ అయిత పరంజ్యోతి దంపతుల ఆధ్వర్యంలో భక్తుల జయజయధ్వానాల మధ్య కనులపండువగా జరిగింది.