calender_icon.png 7 February, 2026 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించడమే పోలీస్ లక్ష్యం

06-02-2026 09:46:05 PM

-ప్రజలకు భరోసా కల్పించడమే పోలీసుల బాధ్యత 

-హుజూర్ నగర్ సిఐ చరమందరాజు

హుజూర్ నగర్ (నేరేడుచర్ల): మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భరోసా కల్పించారు హుజూర్ నగర్ సీఐ చరమందరాజు అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల పట్టణంలో పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు ఎటువంటి భయందోనలకు గురికాకుండా ప్రజాస్వామ్యం ప్రసాదించిన తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీస్ సిబ్బందితో పట్టణంలోని పలు వీధుల్లో  రూట్ మార్చ్ నిర్వహిస్తూ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్ఐలు రవీందర్ నాయక్,నరేష్,కోటేష్ పోలీస్ సిబ్బంది,పాల్గొన్నారు.