09-09-2025 01:19:55 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి) : యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్య లు చేపట్టాలని అధికారులకు మంత్రి తు మ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందవద్దని, రాజకీయ స్వార్థంతో కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలపై రైతులు ఆలోచన చేయాలని మంత్రి సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతాంగానికి భరోసాగా నిలుస్తుందని సోమవారం ఒక ప్రకట నలో మంత్రి పేర్కొన్నారు. యూరియాను కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ పెట్టుకోవద్దని రైతులకు సూచించారు. యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ర్ట వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ ఓ ప్ర కటన విడుదల చేశారు.
యూరియా పక్కదా రి పట్టకుండా రాష్ర్ట వ్యాప్తంగా 500 రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు వేదికల వద్ద రైతులకు టోకెన్లు జారీ చేసి క్యూ లైన్లు లేకుండా యూరియా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో సజావుగా యూరియా పంపిణీ జరుగుతుండటంపై అన్నదాతల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు యూరియా కేంద్రాలు 12 వేల వరకు ఉన్నాయని, ఎక్కువ మంది రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్దనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అందువల్లే ఆయా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తెలిపారు.