15 March, 2026 | 8:38 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష

18-07-2024 03:03 PM

హైదరాబాద్‌: నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ పనులలో వేగం పెంచాలని, ప్రాజెక్టు పురోగతిపై ఇకనుంచి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. దీనితో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై వివరాలను తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.