15 March, 2026 | 7:18 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్‌

18-07-2024 02:47 PM

హైదరాబాద్: చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధికుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని కోర్టు ఆదేశించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షల 80 వేల వీధి కుక్కలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రహదారులపై వ్యార్థాల వల్లే కుక్కల స్వరవిహారం ఎక్కువైందని హైకోర్టు స్పష్టం  చేసింది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించిన తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.