calender_icon.png 12 September, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష

12-09-2025 02:16:54 PM

హైదరాబాద్: గోదావరి నది పుష్కరాల(Godavari Pushkaralu) ఏర్పాట్లు, సన్నద్ధత పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం నాడు కమాండ్ కంట్రోస్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం కీలక సూచనలు చేశారు. తొలి ప్రాధాన్యతగా బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం ఆలయాల అనుసంధానంగా టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్, రోడ్లు, ఆలయాల నవీకరణ, భక్తులకు సౌకర్యాలపై శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎన్ హెచ్ సమీపంలోని గోదావరి పరిహహక ఆలయాలకు,  తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఎన్ హెచ్ సమీపంలో ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సలహాదారు  వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.