12-09-2025 03:13:10 PM
అధికారుల కాలవేల పడుతున్న రైతులు.
హుజురాబాద్,(విజయ క్రాంతి): దేశానికి అన్నం పెట్టే రైతన్న ఒక బస్తా యూరియా అన్న ఇప్పించండి సారు అంటూ రైతులు అధికారులు కాళ్ళ వేల పడుతున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని గద్దపాక, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ముత్తారం గ్రామంలో గురువారం యూరియా వస్తుందన్న సమాచారంతో రైతులు బారులు తీరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.... అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జై జవాన్, జై కిసాన్ ,అనే జాతీయ నినాదాన్ని నేతల ప్రకటనలకే సరిపోయే విధంగా ఉందన్నారు.నేడు తెలంగాణలో యూరియా కోసం రైతులు అల్లాడుతున్న ఘటనలు అద్దం పడుతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడే యూరియా దిగుమతి చేయకపోవడంతో వేసిన వరి పంటలు రెండు నెలలు గడుస్తున్నా, వరి పంటలను కాపాడుకునేందుకు కావలసినంత యూరియా అందించలేకపోయారు. అధికారుల నిర్లక్ష్యంతో పాలకుల వైఫల్యంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని అన్నారు.ఇప్పటికైనా రైతుల యూరియా తిప్పులను దృష్టిలో పెట్టుకొని యూరియా కొరత నియంత్రించేందుకు కృషి చేసి, రైతులు వేసిన పంటలను కాపాడాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.