calender_icon.png 12 September, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొంపల్లి క్వారీల బాంబ్ బ్లాస్టింగ్ లతో పంటలు నష్టపోతున్నాం

12-09-2025 03:16:52 PM

ప్రధాన రహదారి పై రైతుల రాస్తారోకో

పెద్దపల్లి, (విజయక్రాంతి): బొంపల్లి క్వారీల బాంబ్ బ్లాస్టింగ్( bomb blasts) లతో పంటలు నష్టపోతున్నమని పెద్దపల్లి జిల్లా, మండలం బొంపల్లి గ్రామం వద్ద గురువారం రైతులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. క్వారీల్లో జరుగుతున్న బాంబ్ బ్లాస్టింగ్ వలన తమ పంటలకు నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం భూకంపాల దద్దరిల్లుతున్న శబ్దాలు, దుమ్ము కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు సమస్యపై విన్నవించినా పరిష్కారం లేకపోవడంతో రోడ్డుపైకి వచ్చామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీ బ్లాస్టింగ్ తక్షణమే ఆపి, పంట నష్టానికి పరిహారం చెల్లించాలని అధికారులను డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి సర్ది చెప్పి ఆందోళన విరమిచ్చారు.