calender_icon.png 12 September, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 అవకతవకలపై బీజేపీ కిమ్మనడంలేదు: కేటీఆర్

12-09-2025 03:05:52 PM

హైదరాబాద్: రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్నిక స్కాములు చేసినా బీజేపీ పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆరోపించారు. ఏకంగా గ్రూప్-1 పరీక్షలనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పింది. గ్రూప్-1 అవకతవకలపై రాష్ట్ర బీజేపీ కిమ్మనడంలేదని విమర్శించారు. పోస్టుల అమ్మకం ఆరోపణలపై బీజేపీ(Bharatiya Janata Party) మౌనానికి కారణమేంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. మా హయాంలో  ప్రతిదానికీ సీబీఐ విచారణ కావాలని హడావిడి చేశారు. గ్రూప్-1 స్కాంపై బీజేపీ నేతలు సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదన్నారు. రేవత్, బీజేపీ రహస్య మైత్రికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే అన్నారు.

''చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా.. పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ బీజేపీ! రాష్ట్ర ప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా.. రేవంత్ ఎన్ని స్కాములకు పాల్పడినా బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటది. గ్రూప్ 1 నిర్వహణలో ఘోరమైన అవకతవకలు జరిగి ఏకంగా పరీక్షనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పినా రాష్ట్ర బీజేపీ కిమ్మనదు. విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం చేసిన నేరపూరిత నిర్లక్ష్యం మీద డబ్బులకు జాబులు అమ్ముకున్నారన్న ఆరోపణల మీద బీజేపీ మౌనానికి కారణమేంది? బీఆర్ఎస్ హయాంలో ప్రతిదానికీ సీబీఐ ఎంక్వైరీ అని ఒంటికాలి మీద లేచిన బీజేపీ నేతలు గ్రూప్ 1 స్కాం మీద అదే విచారణ ఎందుకు కోరడం లేదు?  రేవంత్ - బీజేపీల రహస్య మైత్రికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే!'' అంటూ కేటీఆర్ ఎక్స్ లో  పేర్కొన్నారు.