calender_icon.png 12 September, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి...

12-09-2025 03:15:05 PM

గార్ల,(విజయక్రాంతి): రైతులు రసాయన ఎరువులు మితంగా వాడి, భూసారాన్ని కాపాడుకోవాలని మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని ముల్కనూర్ గ్రామంలో ఎలాంటి రసాయన ఎరువులు,యూరియా వాడని వరి పంటను క్షేత్ర ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ,రైతులు రసాయనాలకు బదులుగా సేంద్రియ పద్ధతులు,జీవన ఎరువులు,పచ్చిరొట్టను విరివిగా వినియోగించుకోవాలని తద్వారా భూసారం పెరుగుతుందని,నేలలో సరిపడ కర్భన శాతం మెరుగుపడుతుందని తెలిపారు.

సేంద్రియ పద్ధతులు పాటించడం ద్వారా భూమి గుల్ల బారి నీటి నీల్వ సామర్థ్యం పెరిగి, పర్యావరణం పరిరక్షించబడుతుందని, భూమిలో మేలు చేసే కీటకాలు వృద్ధి చెంది పంటలో చీడపీడల నివారణ సాధ్యమవుతుందని దీని ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించవచ్చు అని తెలిపారు.రైతులు విధిగా యూరియా వాడకం తగ్గించి, వాతావరణ సమతుల్యం, పర్యావరణంను  కాపాడుకోవాలని,జీవన ఎరువులు,సమగ్ర పోషక యాజమాన్య చర్యలు, పచ్చిరొట్ట ఎరువులను విరివిగా వినియోగించడం అలవర్చుకోవాలని సూచించారు.రసాయన ఎరువుల వాడకం నేల ఆరోగ్యాన్ని క్షిణింపచేయడమే కాకుండ,భూమి నుండి పోషకాలను బయటకు పంపుతుందని అన్నారు. ఈ క్షేత్ర సందర్శనలో మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు,విస్తరణ అధికారి మేఘన, రైతులు తదితరులు పాల్గొన్నారు.