12-09-2025 03:10:40 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): పేద వెనుక బడిన వర్గాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ(Congress party) లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీ పేదల పక్ష పాతి అని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు అన్నారు. శుక్రవారం మెట్ పల్లిలో పార్టీ కార్యాలయంలో నర్సింగారావు ముగ్గురికి లక్ష అరవై వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని పేదలకు లబ్ధి చేకూర్చే అభివృద్ధి పనులు చేస్తుందని అదేవిధంగా అత్యవసర ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి,సంటి సురేష్, మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి, యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్, యమ రాజయ్య, బత్తుల భరత్, నాయిని సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.