02-12-2025 02:18:30 PM
జేబులో ఒక్క రూపాయి కూడా వేసుకోలే
సోనియా, రాహుల్ కు అండగా నిలబడతాం
హైదరాబాద్: గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం(TPCC Executive Committee Meeting) జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి ఆర్థిక సాయం అందించామని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెడితే భయపడేది లేదని తేల్చిచెప్పారు. దేశంలో కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందన్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని సూచించారు. ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్(National Herald) సిబ్బందికి మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకున్నారని తెలిపారు. పత్రికను తిరిగి నడిపించాలంటే బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులను తీసుకున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలని నేషనల్ హెరాల్డ్ పత్రిక పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టారని, షేర్ క్యాపిటల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటైర్మెంట్ బినిఫిట్స్ ఇచ్చారని చెప్పారు.
ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధించినది కాదు.. ఎవరూ జేబులో ఒక్క రూపాయి కూడా వేసుకోలేదన్నారు. ఆస్తులన్నీ నెహ్రూవే.. వారసత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పత్రిక నడపాలని ప్రయత్నించారని వెల్లడించారు. మనీలాండరింగ్ కేసు(Money laundering case), ఈడీ కేసులు పెట్టి మానసికంగా సోనియా, రాహుల్ ను వేధిస్తారా? అని ప్రశ్నించారు. మానసిక ధైర్యం కోల్పోకుండా సోనియా, రాహుల్ కేసులు ఎదుర్కున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చాం.. ఇలాంటి కేసులకు భయపడమని చెప్పారని సీఎం పునరుద్ఘాటించారు. దేశస్థాయిలో ఓట్ల చోరీ కార్యక్రమాన్ని బయటపెట్టే సరికి కేంద్రం భయపడే వేధింపులకు పాల్పడుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ(Vote Chori) ప్రచారాలను అడ్డుకోవాలనే సోనియా, రాహుల్ పై మళ్లీ కేసులు పెట్టారని సూచించారు. సోనియా, రాహుల్ పై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నామని తెలిపారు. సోనియా, రాహుల్ కు తెలంగాణ ప్రజలంతా అండగా నిలబడతామని సీఎం తెలిపారు.