17 April, 2026 | 4:05 PM

దివ్యాంగులకు బాసటగా సీఎం రేవంత్‌రెడ్డి

14-06-2025 01:17 AM

దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య 

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దివ్యాగుల సంక్షేమం, అమలు విషయంలో ఎంతో ఉదారతతో ఉన్నా రని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కొనియాడారు. దివ్యాంగులకు ఉచితంగా అందించే సహాయ ఉపకరణాల వైకల్యం శా తం పరిమితిని 40 శాతం వరకు త గ్గించారని తెలిపారు. శుక్రవారం ది వ్యాంగుల సంక్షేమ శాఖకు చెందిన పలు సంఘాల నాయకులు ముత్తినే ని వీరయ్యను సన్మానించారు.

ఈ సందర్భంగా ముత్తినేని మాట్లాడు తూ.. దివ్యాంగులు వివాహం చేసుకుంటే కల్యాణలక్ష్మితో పాటు అద నంగా మరో రూ.లక్ష ప్రోత్సాహం ఇ వ్వాలని తీసుకున్న నిర్ణయం ద్వారా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌పీఆర్టీ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు బెస్త యాదగిరి, వీ రాజశేఖర్, అడ్డా రా జు, ప్రవీణ, విజయసింహారెడ్డి, మ ధు, రవి, జెర్రిపోతుల నరసింహా, గం గారెడ్డి, భాస్కరాచారి పాల్గొన్నారు.