8 May, 2026 | 9:01 AM

తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఆదర్శంగా ఉండాలి

10-12-2024 10:17 PM

టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ గౌడ్...

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహము అందరికీ ఆదర్శంగా ఉండాలని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు రవీందర్ గౌడ్ అన్నారు. మంగళవారం రామారెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు సచివాలయంలో ఏర్పాటు చేసిన నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో దానిని గతంలో ఏర్పాటు చేసిన విగ్రహం కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహం కాంగ్రెస్ విగ్రహంగా హస్తాన్ని చూపుతూ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి అంటే అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఉండాలని కిరీటం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని నిరసిస్తూ పాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ రైతుబంధు అధ్యక్షులు నారాయణరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడగల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.