calender_icon.png 2 December, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

02-12-2025 08:41:49 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) కు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు కేంద్రమంత్రులను ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది.

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీలో సిమిట్ కోసం వేగంగా పనులు జరుగుతున్నాయి. సమ్మిట్ లో వీవీఐపీలు, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు పాల్గొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు వీవీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సమ్మిట్ కు వచ్చేవారి వాహనాలకు కిలో మీటర్ దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ నుంచి వేదిక వద్దకు వచ్చేందుకు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు.