02-12-2025 08:26:42 AM
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation) విస్తరణను వేగవంతం చేసే రెండు కీలకమైన ఆర్డినెన్స్‌లను ఆమోదించారు. మున్సిపల్ చట్టంలో సవరణలు, దాని పొడిగింపుకు సంబంధించిన ఆర్డినెన్స్‌లను నవంబర్ 25న కేబినెట్ ఆమోదించింది. సోమవారం అధికారికంగా ఆమోదించింది. దీంతో ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) లోపల ఉన్న 27 మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లను GHMCలో విలీనం చేయడానికి మార్గం సుగమం అయింది. తెలంగాణ ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ విలీన ప్రణాళికపై పని చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.