11-09-2024 11:56:00 AM
ఆక్రమణల నుంచి చెరువులకు విడిపించేందుకు హైడ్రా
హైదరాబాద్: కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్ లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫాంహౌస్ ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేట్ లో కలుపుతున్నారని చెప్పారు. గండిపేట జలాలు నగర ప్రజల తాగునీటికి వాడుతున్నామని సీఎం వెల్లడించారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు వస్తే పేదల ఇళ్లు మునుగుతున్నాయని తెలిపారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు.
ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోండి.. ఆక్రమణలను కూల్చే బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్ తెలిపారు. కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా.. కోర్టుల్లో కొట్టాడుతామని స్పష్టం చేశారు. హైదరాబ్ కాలుష్యం నల్గొండకు చేరుతోందని సీఎం పేర్కొన్నారు. నల్గొండకు చేరుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు. పేదల పట్ల ప్రభుత్వం మనవతా ధోరణితో వ్యవహరిస్తుందని సూచించారు. 11 వేల మంది బాధితులకు 2 పడక గదుల ఇళ్లు ఇస్తామని సీఎం వెల్లడించారు. పోలీస్ స్కూల్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు.