calender_icon.png 9 February, 2026 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ చీఫ్

09-02-2026 12:54:32 PM

రాష్ట్ర  పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాస ఉత్తంకుమార్ రెడ్డి.

బీఆర్ఎస్ బిజెపిలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్టే

మున్సిపల్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను క్లీన్ చీప్ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి, ఇన్చార్జి మంత్రి నల్ల మాస  ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి, మాట్లాడారు. గత ప్రభుత్వం తెలంగాణ పూర్తిస్థాయిలో అప్పులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం విద్య వైద్యానికి పెద్ద పీట వేస్తూ, వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఉచిత విద్యుత్తు, సన్న బియ్యం పంపిణీ, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు, మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపిలోకి ఓటు వేస్తే మోడీలో వేసినట్లే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 120 మున్సిపల్ స్థానాల్లో, అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతులు భారతదేశంలోనే అత్యధిక పంట సాగు విస్తీర్ణం లోకి వచ్చినట్లు తెలిపారు.

కొంతమంది కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనులు పెట్టుకొని వార్తల్లోకి వస్తున్నారని వారిని వారి మాటలను నమ్మవద్దని హెచ్చరించారు. తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, పిసీసీ అధ్యక్షులు రవళి, పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, జిల్లా నాయకులు ఎల్సోజి నరేష్ రేతినేని, శ్రీనివాస్, రేగటి రవి గౌడ్, నల్లు రామచంద్రారెడ్డి, మున్సిపల్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.