calender_icon.png 9 February, 2026 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ

09-02-2026 03:36:50 PM

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సుల్తానాబాద్ లో ఘన స్వాగతం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు చిల్లి  గవ్వ కూడా ఇవ్వడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి, కిషన్ రెడ్డి అన్నారు, సోమవారం సుల్తానాబాద్ కు వచ్చిన కిషన్ రెడ్డి కి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ  మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయని అన్నారు, 

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు చిల్లి గవ్వ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం , గ్రామీణ ప్రాంతాలకు వేస్తున్న రోడ్లకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నారు, పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉంది అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం, గ్రామీణ ప్రాంతాల్లో వేస్తున్న రోడ్లకు నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ఘోరంగా విఫలమైందన్నారు, ఈ కార్యక్రమం లో రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి, సుల్తానాబాద్ మున్సిపల్ ఇంచార్జ్ రాణి రుద్రమదేవి , పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి, నాయకులు మీసా అర్జునురావు,  నల్ల మనోహర్ రెడ్డి , గుర్రాల మల్లేశం,  గొట్టే ముక్కల సురేష్ రెడ్డి,  కడారి అశోక్ రావు, సౌదరి మహేందర్ యాదవ్, కందుల శ్రీనివాస్ తోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...