11-09-2024 11:40:01 AM
హైదరాబాద్: తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) హైదరాబాద్‌లోని అక్రమ దగ్గు తయారీ యూనిట్‌కు సీలు వేసి రూ.65,000 విలువైన 635 దగ్గు మందు సీసాలను సీజ్ చేసింది. కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌లోని అఖిల్ లైఫ్ సైన్సెస్ ఈ సిరప్‌ను ఉత్పత్తికి అవసరమైనడ్రగ్ లైసెన్స్ లేకుండానే అనధికారికంగా తయారుచేస్తోందని డీజీఏ డీసీఏ వీబీ కమలాసన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డ్రగ్ తయారీ కేంద్రంపై దాడి చేసిన డీసీఏ బృందాలు డీసీఏ నుంచి డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే తయారు చేయాల్సిన లైసెన్స్ లేని గ్లైకోరిల్ కఫ్ సిరప్‌ను 100 మిల్లీలీటర్ల 635 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అఖిల్ లైఫ్ సైన్సెస్ యాజమాన్యం సి భాస్కర్ రెడ్డి వద్ద నుంచి ఉత్పత్తికి సంబంధించిన ప్రింటెడ్ లేబుళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కూకట్ పల్లిలో తయారు చేసి బెంగళూరు కంపెనీ పేరిట మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరు గామి ఫార్మా కంపెనీ పేరుతో నిందితులు మార్కెటింగ్ చేస్తున్నారు. నకిలీ మందులపై 1800-599-6969 నంబర్ కు సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. చెల్లుబాటు అయ్యే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ లేకుండా డ్రగ్స్ తయారు చేయడం, విక్రయించడం డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం ప్రకారం శిక్షార్హమైనది, గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది అని కమలాసన్ రెడ్డి తెలిపారు.