calender_icon.png 9 February, 2026 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు ఘన సత్కారం

09-02-2026 03:45:42 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్సిసి ఎయిర్ వింగ్, ఆర్మీ గ్రూపులకు చెందిన విద్యార్థులు న్యూఢిల్లీలో 2026 జనవరిలో జరిగిన గణతంత్ర దినోత్సవ ఎన్సిసి కవాత్‌లో పాల్గొని కళాశాలకు గౌరవం తీసుకొచ్చారు. సోమవారం కళాశాలకు చేరుకున్న విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ ఎన్సిసి క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తుందని, కఠిన సాధన ద్వారానే జాతీయ స్థాయి అవకాశాలు సాధ్యమవుతాయని తెలిపారు. కళాశాల నుండి విద్యార్థులు ఆర్డి క్యాంపుకు ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు.

ఆర్డి క్యాంపులో పాల్గొన్న ఎండి బాబా, ఈ శ్రీనాథ్, కే.ప్రమోద్, వై.ప్రవీణ్, కే.జై రామ్, బి.శైలేశ లు మాట్లాడుతూ... ఎంపిక ప్రక్రియ కఠినమైందని, నిరంతర సాధనతో పాటు పరేడ్‌లో చూపిన ప్రతిభ ఫలితంగా ఈ అవకాశం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి అధికారులు స్వామి, ప్రసాద్, నహీదా పర్వీన్, అధ్యాపకులు శ్రీధర్ కుమార్, బిక్షపతి, నాగయ్య, శ్రీనివాస్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆదిరెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎన్సిసి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.