6న బాసరకు సీఎం రేవంత్‌రెడ్డి
- రూ.100 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు
నిర్మల్, మార్చి 31 (విజయక్రాంతి): దక్షిణ భార తదేశంలోనే ఏకైక సరస్వ తి నిలయమైన జ్ఞాన సరస్వతి బాసరను ఆధ్యాత్మిక పర్యాటక కేం ద్రంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నదని దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడించారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాసరలో రూ.100 కోట్ల యాక్షన్ ప్లాన్ అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. మంగళవారం బాసరను సందర్శించి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.
అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాసరలో భక్తుల రద్దీకనుగుణంగా ఆలయ విస్తరణ, కొత్త పుష్కర ఘాట్లు, ట్రాఫిక్ నియంత్రణకు రోడ్లు, విశ్రాంతి గదులు, మౌలిక సదుపాయాలు, గోదావరి పుష్కరాల నేపథ్యంలో టూరిజం అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. బాసరలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.




