1 April, 2026 | 2:25 AM

ఆస్తి పన్నుపై ఎర్లీ బర్డ్ ఆఫర్

01-04-2026 01:08 AM

ఏప్రిల్ నెలాఖరులోగా చెల్లిస్తే 5% రాయితీ: కమిషనర్ కర్ణన్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 31 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏటా అమలు చేసే ఎర్లీ బర్డ్ పథకానికి మళ్లీ తెరతీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026 27కి సంబంధించిన ఆస్తిపన్నును ముందుగానే చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఇస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ప్రకటించారు.

నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మం గళవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పిలుపునిచ్చారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నెలలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి మాత్రమే ఈ ఎర్లీ బర్డ్ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి నెలాఖరులోపు మొత్తం ఆస్తి పన్నును ఏకమొత్తంగా ముందుగానే చెల్లించిన వారికి ఆ పన్నుపై 5 శాతం రాయితీ లభించనుంది.