10-10-2025 12:00:00 AM
సీనియర్ నేత, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి
ఆర్కేపురం డివిజన్‌లో సంతకాల సేకరణ
ఎల్బీనగర్, అక్టోబర్ 9 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతుందని, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో గురువారం ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీ పీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఇతర పార్టీల ఓటర్లను ఓటరు జాబితా నుంచి పేర్ల తొలిగింపు, ఓటర్ల చేరికలు చేయిస్తున్నట్లు ఆరోపించారు.
కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, గట్ల రవీంద్ర, రవీంద్ర మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్, నాయకులు రాజు నాయక్, పగడాల ఎల్లయ్య, అక్బర్, కళ్యాణ్, సమద్, పటేల్, డాక్యార నాయక్, దుబ్బాక శేఖర్, పెద్దవూర సైదులు, నబీ, అశోక్, సలీం, రఫీ,విజయ్, రేణుక, మాధవి, అరుణ, రమ, లావణ్య, మంజుల, ఈశ్వరి, రజిత, కవిత, సంతోషి తదితరులు పాల్గొన్నారు.