23 July, 2026 | 4:24 AM

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

29-06-2024 10:49 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఐదు రోజులుగా పార్టీ హైకమాండ్తో సీఎం పలు కీలక చర్చలు జరిపారు. పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ నియామకంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరనట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం మరోసారి పార్టీ పెద్దలతో రేవంత్  రెడ్డి సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్కు రానున్నారు.