06-12-2025 09:46:58 AM
హైదరాబాద్: తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శనివారం నాడు నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో(Devarakonda Mandal) పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి వెళ్లనున్నారు. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) ఏర్పాట్లను పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవరకొండ పట్టణంలో నిర్వహించనున్న భారీ సభకు 25 వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.