calender_icon.png 6 December, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు-ట్రక్కు ఢీ: ఐదుగురు మృతి

06-12-2025 09:06:57 AM

ఛత్తర్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలోని(Chhatarpur) ఒక హైవేపై కారు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, ఇద్దరు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి సత్నా పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు షాఘర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

35 కి.మీ దూరంలో ఉన్న సాగర్-కాన్పూర్ జాతీయ రహదారిపై(Sagar-Kanpur National Highway) గుల్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కారు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య పాట్లే తెలిపారు. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేసి, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆదిత్య పాట్లే తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు  ఏఎస్పీ ఆదిత్య పాట్లే పేర్కొన్నారు.