06-12-2025 08:37:32 AM
హోర రోడ్డు ప్రమాదం: నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
రామేశ్వరం: తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో(Rameswaram) శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు(Ayyappa Devotees) మృతి చెందారు. వేగంగా వస్తున్న లారీ ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. రోడ్డు పక్కన కారు ఆగి ఉందని, లారీ ఢీకొన్న సమయంలో అందులో ఉన్న వారందరూ నిద్రలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు శబరిమల యాత్ర(Sabarimala Pilgrimage) ముగించుకుని తిరిగి వస్తున్నారు. మృతుల్లో ముగ్గురు విజయనగరం జిల్లా(Vizianagaram District) దత్తిరాజేరు మండలం కొరాపు కొత్తవలస గ్రామానికి చెందినవారు కాగా, నాలుగో వ్యక్తి గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందినవారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.