22 July, 2026 | 8:47 PM

Breaking News

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

29-06-2024 03:34 PM

హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. వరంగల్ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. హనుమకొండలో మహిళా శక్తి క్యాంటీన్ ను సీఎం ప్రారంభించారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ను సీఎం పరిశీలించారు. కైటెక్స్, యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో సీఎం మాట్లాడారు. టెక్స్ టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. టెక్స్ టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా కృషిచేస్తామన్నారు. టెక్స్ టైల్ పార్క్ సమగ్ర అభివృద్థికి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.